Saturday, August 24, 2013

One of the most inspiring poems read in my childhood


లక్ష్మణ కవి కలములొ నుండి జాలువారిన ఆణిముత్యం :

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై 
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ 
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై 
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి

ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.


Which translates to - People in the world are classified as three different kinds.
The first kind is those who do not start a work for fear of facing obstacles/ difficulties who are those of the lowly kind, the second kind, who start a work and leave it in the middle the moment they face an obstacle - they are medium kind and finally those who despite all difficulties stand up to the task and finish it - who are the noble ones.

No comments: